గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 4 ఫిబ్రవరి 2023 (13:32 IST)

తొలిసారి బిడ్డకు జన్మనివ్వబోతున్న ట్రాన్స్‌జెండర్

pregnant
pregnant
ట్రాన్స్ జెండర్ తొలిసారి బిడ్డకు జన్మనివ్వబోతున్నారు. ఈ మేరకు ఓ ట్రాన్స్ జెండర్ జంట తల్లిదండ్రులు కాబోతున్నారని ప్రకటించారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. కేరళ కోజికోడ్‌కు చెందిన వీరు మార్చి నెలలో తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపారు. గత మూడేళ్ల పాటు సహజీవనం చేస్తున్న ఈ జంట ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ హ్యాపీ న్యూస్‌ను ప్రకటించింది. 
 
తల్లి కావాలనుకునే తన కల, తండ్రి కావాలనుకునే తన కోరిక త్వరలోనే తీరనున్నాయి. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ జియో పావెల్‌లో ఇన్ స్టాలో తెలిపింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్ అంటూ జియో పావెల్ ఇన్ స్టాలో రాసింది. 
 
తాను పుట్టుకతో స్త్రీని కానప్పటికీ.. ఒక శిశువు తనను అమ్మా అని పిలవాలనే కల తనలో వుందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం 8 నెలల గర్భం అని.. ఓ ట్రాన్స్‌జెండర్ జంట బిడ్డకు జన్మనివ్వడం దేశంలోనే ఇదే తొలిసారి.