గురువారం, 16 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 6 అక్టోబరు 2019 (11:48 IST)

మరిదిపై మోజు... మటన్ సూప్‌లో సైనెడ్ కలిపి... ఆరుగురిని హతమార్చి మహిళ

కేరళ రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుగురు హత్య కేసులోని మిస్టరీ వీడింది. మటన్ సూప్‌లో సైనెడ్ కలిపి హత్య చేసినట్టు పోలీసుల దర్యార్తులో తేలింది. అలా గత 14 యేళ్ళలో ఒకే కుటుంబంలోని ఆరుగురిని హత్య చేశారు. వీరందరినీ హత్య చేసింది కూడా కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. ఆస్తికోసం ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తేలింది. 
 
కోళికోడ్‌ జిల్లా కూడథాయ్ గ్రామంలో ఓ క్యాథలిక్ ఫ్యామిలీలో ఆరుగురు హత్యకు గురయ్యారు. 2002 నుంచి 2016 వరకు కుటుంబంలోని ఒక్కొక్కరు చనిపోయారు. ఆస్తి కోసం జాలీజోసెఫ్(47) కుటుంబసభ్యులను హతమార్చింది. భర్త సోదరుడు షాజుపై మనసు పడిన ఆమె.. ఈ దారుణానికి ఒడిగట్టింది. ఆస్తి మీద కన్నేసిన జాలీ.. షాజు సాయంతో కుటుంబసభ్యలను పక్కా స్కెచ్ ప్రకారం మర్డర్ చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. 14 ఏళ్లుగా కుటుంబంలోని ఒక్కొక్కరిని చంపుతూ వచ్చిందని పోలీసులు వెల్లడించారు.
 
2002లో అత్త అన్నమ్మ థామస్(57), 2008లో మామ టామ్ థామస్(66) చనిపోయారు. 2011లో భర్త రాయ్ థామస్(40) ను సైతం హత్య చేసింది జాలీ. 2014లో అన్నమ్మ సోదరుడు మ్యాథ్యూ(67) చనిపోయారు. 2016లో అల్ఫోన్సా(2), ఆ తర్వాత ఆమె తల్లి సిలీ(27) చనిపోయారు. వారందరివి సహజ మరణాలే అని జాలీ జోసెఫ్.. కుటుంబసభ్యులను, స్థానికులను నమ్మించింది. ఎవరికీ ఎలాంటి అనుమానాలు రాకుండా డీల్ చేసింది. అందరి మృతదేహాలను గుట్టు చప్పుడు కాకుండా స్మశానికి తీసుకెళ్లి పాతిపెట్టింది.
 
అయితే దీనిపై థామస్ సమీప బంధువు చార్లెస్‌కి అనుమానం వచ్చింది. 14 ఏళ్ల వ్యవధిలో కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా చనిపోవడంపై సందేహం కలిగింది. ఏదో జరిగిందని డౌట్ రావడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం పోలసులను విస్మయానికి గురిచేసింది. 
 
14 ఏళ్ల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు చనిపోవడం వారికి కూడా అనుమానాస్పదంగా అనిపించింది. పోలీసులు మృతదేహాలను తిరిగి బయటికి తీయించారు. వాటిని పోస్టుమార్టంకు తరలించారు. పోస్టుమార్టం నివేదికలో సంచలన నిజం బయటపడింది. వారిది సహజ మరణం కాదు.. మర్డర్ అని తేలింది. అందరికి సైనెడ్ ఇచ్చి చంపేశారని తేలింది.