గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By మోహన్
Last Updated : సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:53 IST)

నాపై దుష్ప్రచారం చేసారని డీజీపీకి ఫిర్యాదు చేసా: లక్ష్మీ పార్వతి

తన ప్రతిష్ఠను దెబ్బతీసేలా కోటి అనే వ్యక్తి తనపై సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని ఎన్టీఆర్ సతీమణి, వైకాపా నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు. గౌరవప్రదమైన స్థాయిలో ఉన్న తనను అగౌరవపరుస్తూ  విమర్శలు చేస్తున్నారని అన్నారు. అందుకోసమే తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. సదరు వ్యక్తిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. 
 
డీజీపీని కలిసిన అనంతరం లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 4వ తేదీన తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఓ టీవీ ఛానల్‌, సోషల్‌ మీడియాలో తన వ్యక్తిత్వాన్ని కోటి అనే వ్యక్తి కించపరిచారని ఆమె మండిపడ్డారు. అతనితో పాటు ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేసిన మీడియా ఛానల్‌‌, యాంకర్లపై చర్యలు తీసుకోవాలని కూడా డీజీపీని కోరినట్లు లక్ష్మీపార్వతి తెలిపారు.