శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 జూన్ 2021 (09:06 IST)

కుక్కను నోట కరుచుకుని వెళ్లిన చిరుత (Video)

రాత్రి వేళ ఇంటి ముందు పడుకుందో పెంపుడు కుక్క. మాటువేసిన చిరుత ఎలాంటి అలికిడి చేయకుండా దానిని నోట కరుచుకుని వెళ్లిపోయింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాషిక్‌ సమీపంలో ఉన్న భుసె గ్రామంలో జరిగింది. ఇదంతా ఆ ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ వీడియోలో ఒక కుక్క ఇంటి బయట నిద్రిస్తున్నట్లు కనిపిస్తుంది. చిరుతపులి నిశ్శబ్దంగా కుక్క వైపు నెమ్మదిగా కదులుతుంది. 
 
కుక్కకు చాలా దగ్గరగా చేరిన తరువాత, ఈ చిరుతపులి అకస్మాత్తుగా దానిపై దాడి చేస్తుంది. ఆపై చిరుతపులి తన దవడలో కుక్కను పట్టుకుని తీసుకెళ్తుంది. ఈ వీడియో నాసిక్ అనే గడ్డి గ్రామంలోని ఒక ఇంటిది. చిరుతపులి, కుక్కను పట్టుకున్న తరువాత, నెమ్మదిగా పొదలు వైపుకు వెళ్లి, తరువాత చిరు అదృశ్యమైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.