గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (22:25 IST)

వీణతో వాకా వాకా పాటను ప్లే చేసిన యువకుడు.. వీడియో వైరల్

Waka Waka song in Veena
Waka Waka song in Veena
2010 వరల్డ్ కప్ ఫుట్‌బాల్ మ్యాచ్ సందర్భంగా కొలంబియా గాయని షకీరా రాసి పాడిన వాకా వాకా పాట ఫుట్‌బాల్ అభిమానులనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ఆకర్షించింది. ఈ పాటలోని సంగీతం, షకీరా నృత్యం అభిమానుల హృదయాలను గెలుచుకుంది. తాజాగా ఈ పాటను ఓ యువకుడు వీణపై వాకా వాకా పాటను ప్లే చేస్తున్న వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 
 
మ్యూజిక్ కంపోజర్ మహేష్ ప్రసాద్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఈ వీడియోను పంచుకున్నారు. వీడియోలో, సంగీతకారుడు తన వీణతో వాకా వాకా పాటను ప్లే చేస్తాడు. 4వ తేదీన షేర్ చేసిన ఈ వీడియోకు 26 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన యూజర్లు వీణా కళాకారుడి ప్రతిభను మెచ్చుకుంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. కొంతమంది తమ సెల్‌ఫోన్‌లలో వీణలో వాకా వాకా పాటను రింగ్‌టోన్‌గా ప్లే చేసుకుంటున్నారు.