మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 ఆగస్టు 2021 (10:17 IST)

మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని చెట్టుమీద కూర్చుంది..?

ఉత్తరప్రదేశ్‌లో ఓ వింత సంఘటన జరిగింది. మామూలుగానే కోతులు చేసే పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. వాటికి ఏదైనా దొరికితే తీసుకొని చెట్టెక్కి కూర్చుంటాయి. అలానే ఉత్తర ప్రదేశ్‌లోని హార్దోయి జిల్లాలోని సాంఢీ పోలిస్ స్టేషన్ పరిధిలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న బైక్ నుంచి మూడు లక్షల బ్యాగ్‌ను ఎత్తుకొని వెళ్లి చెట్టుమీద కూర్చుంది. 
 
విషయం గమనించిన బైక్ యజమాని ఆశిష్ సింగ్‌ తన బ్యాగ్ ఇచ్చేయమని కోతిని బతిమిలాడాడు. కానీ, కోతి పట్టించుకోలేదు. వెంటనే ఆశిష్ సింగ్ దగ్గరలో ఉన్న సాంఢీ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. తన బైక్ నుంచి కోతి మూడు లక్షల రూపాయల బ్యాగ్ కొట్టేసిందని ఫిర్యాదు చేశాడు. 
 
అదే సమయంలో ఆ కోతి తన చేతిలోని డబ్బుల బ్యాగ్‌ను కింద పడేసింది. అక్కడే ఉన్న సెక్యూరిటి గార్డ్ ఆ డబ్బును తీసుకొని వెళ్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. సెక్యూరిటీ గార్డ్ నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు. దీనికి సంబందించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.