బుధవారం, 17 సెప్టెంబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 22 ఆగస్టు 2025 (15:15 IST)

వరుసగా కూర్చుని విందు భోజనం ఆరగిస్తున్న వానరాలు (video)

Monkeys sitting in a row and enjoying meals
ఏఐ సౌకర్యం వచ్చిన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో ఆసక్తి రేకెత్తించేందుకు పలువురు యూజర్లు వీడియోలను రూపొందించి పెట్టేస్తున్నారు. ఐతే ఇలాంటి వీడియోల్లో కొన్ని నవ్వించేవిగా వుంటున్నాయి. మరికొన్ని ఆసక్తిని రేకెత్తించేవిగా వుంటే ఇంకొన్ని తీవ్రంగా బాధించేవిగా కూడా వుంటున్నాయి. ఆసక్తికరంగా, వినోదాత్మకంగా రూపొందించే వీడియోలను నెటిజన్లు ఆదరించడమే కాకుండా అలాంటివి క్రియేట్ చేసినవారికి థ్యాంక్స్ చెప్తున్నారు.
 
తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. పదులకొద్దీ కోతులు వరుసగా కూర్చుని విందు భోజనాన్ని ఆరగిస్తున్నట్లు ఓ వీడియోను పోస్ట్ చేసారు. ఐతే కోతి అంటేనే నిలకడ లేకుండా వుంటుంది. అలాంటిది అన్నికోతులు చక్కగా కూర్చుని విందు ఆరగించడం అంటే... అది ఏఐ వీడియో కాక మరేమవుతుంది? మీరూ చూడండి.