గడ్డం గీయించినా.. గొంతు కోసినా మేం ముస్లింలగానే ఉంటాం : ఓవైసీ

ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవులను అక్రమంగా తరలిస్తున్నారో... గొడ్డు మాంసం ఆరగిస్తున్నారనో.. గడ్డం పెంచారనో ఇలా ఏదో కారణంతో కొన్ని అల్లరి మూకలు

pnr| Last Updated: సోమవారం, 6 ఆగస్టు 2018 (12:23 IST)
ఉత్తరభారతంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి. ముఖ్యంగా, గోవులను అక్రమంగా తరలిస్తున్నారో... గొడ్డు మాంసం ఆరగిస్తున్నారనో.. గడ్డం పెంచారనో ఇలా ఏదో కారణంతో కొన్ని అల్లరి మూకలు దాడులకు పాల్పడుతున్నారు.
 
ఈనేపథ్యంలో తాజాగా హర్యానాలో బలవంతంగా ఓ ముస్లిం యువకుడికి గుర్తు తెలియని వ్యక్తులు.. గడ్డం గీయించారు. ఇది వివాదాస్పదమైంది. దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సోమవారం స్పందించారు. 
 
హర్యానాలో ముస్లిం యువకుడికి గడ్డం గీయించిన వ్యక్తులకు, వారి తల్లిదండ్రులకు తాను చెప్పేది ఒక్కటే.. మీరు మా గొంతు కోసినా కూడా.. తాము ముస్లింల లాగానే ఉంటామని ఓవైసీ తేల్చిచెప్పారు. తాము మిమ్మల్ని ఇస్లాం మతంలోకి మార్చి గడ్డం పెంచామని చెబితే ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల వల్ల దేశంలో అశాంతి పెరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత చదవండి :