1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

రాజకీయాల నుంచి తప్పుకుంటానంటున్న కేంద్ర మంత్రి

గిరిరాజ్ సింగ్. ఈయన ఓ కేంద్ర మంత్రి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఈయన తాజాగా ఓ సంచలన విషయాన్ని వెల్లడించారు. తాను అనుకున్న లక్ష్యాల్లో ఒకటి నెరవేరిందన్నారు. రెండోది నెరవేరే సమయం ఆసన్నమైందన్నారు. ఆ రెండు లక్ష్యాల్లో ఒకటి రామమందిర నిర్మాణమన్నారు. రెండోది తాను క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడమన్నారు. 
 
ఇద అంశంపై ఆయన బీహార్‌లో మీడియాతో మాట్లాడుతూ, అయోధ్యలో శ్రీరామునిది దేవాలయం, జనాభా నియంత్రణ తన కెరీర్‌లో రెండు ప్రధాన లక్ష్యాలన్నారు. రామాలయం నిర్మించే సమయం వచ్చేసిందని, ఇది తనవంటి వృద్ధులు రాజకీయాలకు స్వస్తి చెప్పాల్సిన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
ఇకపోతే, జనాభా నియంత్రణ చట్టం త్వరలోనే అమలులోకి వస్తుందని భావిస్తున్నానని, ఆపై రాజకీయాల నుంచి రిటైర్ మెంట్ తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు. కాగా, గతంలో పలుమార్లు జనాభా నియంత్రణపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముస్లింల కారణంగానే దేశంలో జనాభా పెరుగుతోందని, ఆ అంశమే తనను రాజకీయాలవైపు మళ్లించిందని ఆయన అంటుండేవారు.