గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (13:13 IST)

ఇన్‌స్టాలో తొలిరాత్రి వీడియో - జంటపై ట్రోల్స్ వెల్లువ

marriage
ప్రతి ఒక్కరికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితంలో వివాహం ఒక ముఖ్యమైన క్షణం. ప్రతి ఒక్కరూ ఈ క్షణాన్ని తమ జీవితాంతం గుర్తుంచుకోవడానికి భిన్నంగా జరుపుకోవాలని కోరుకుంటారు. అయితే  రాహుల్ - అరుషి జంట, వివాహంతో  తొలి రాత్రి వీడియోను నేరుగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీంతో రాహుల్ -అరుషిలపై ట్రోల్స్ మొదలైయ్యాయి.
 
అంతేగాకుండా ఆగ్రహించిన నెటిజన్లు వారిపై తీవ్ర పదజాలంతో ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి అందరూ డిఫరెంట్ వీడియోలు షూట్ చేస్తూ ట్రెండింగ్‌లో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. 
 
డ్యాన్స్‌ నుంచి పార్టీల వరకు తమ కుటుంబ సభ్యుల వీడియోలను అప్‌లోడ్ చేసేవారు. అయితే కొంత మంది హద్దులు దాటుతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో చర్చనీయాంశమైంది.
 
పెళ్లి తర్వాత తమ తొలి రాత్రి వీడియోను ఓ జంట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో, జంట వారి గదిలో కనిపించింది. ఇద్దరూ పెళ్లి దుస్తుల్లో ఉన్నారు. పెళ్లికూతురు నగలు తీసేయడం, భర్త ఆమెను కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి కనిపించాయి. 
 
నగలు, బట్టలు తీసేయడంలో కూడా ఆమెకు సాయం చేస్తున్నాడు. ఆ వీడియో పాతదే అయినా ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లలో ఒకరు, ఇది మీ ప్రైవేట్ క్షణం, దీన్ని ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదని  మండిపడ్డారు.