సోమవారం, 25 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 జులై 2025 (12:24 IST)

100 మంది అమ్మాయిల్లో నలుగురే పవిత్రులు: ప్రేమానంద్ వివాదాస్పద వ్యాఖ్యలు

Premanand Maharaj
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురకు చెందిన ప్రేమానంద్ మహారాజ్ మహిళలపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. ఆయన చేసిన వ్యాఖ్య ఏంటంటే... 100 మంది అమ్మాయిలలో ఇద్దరు నుంచి నలుగురు మాత్రమే పవిత్రంగా వున్నారు.
 
ఎందుకంటే ఈరోజుల్లో ఓ అబ్బాయి నలుగురు అమ్మాయిలను కలుస్తున్నాడు. అలాంటివాడు మంచి భర్త ఎలా అవుతాడు? అలాగే నలుగురు అబ్బాయిలతో కలిసి తిరిగే అమ్మాయి మంచి కోడలు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. ప్రేమానంద్ మహారాజ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.