మంగళవారం, 26 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 18 అక్టోబరు 2018 (17:38 IST)

సిక్కోలు బాధితుల కష్టాలు వింటుంటే కన్నీళ్ళొస్తున్నాయి : పవన్ కళ్యాణ్

తిత్లీ తుఫాను ధాటికి సర్వం కోల్పోయిన సిక్కోలు తుఫాను బాధితుల కష్టాలు వింటుంటే కన్నీళ్లొస్తున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన సిక్కోలులో ఆయన పర్యటించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సిక్కోలు అంటే నాకు విపరీతమైన అభిమానం. అందులో పచ్చటి ఉద్దానం అంటే ఎంతో ఇష్టం. అటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు సర్వనాశనమైపోయింది. బాధితుల కష్టాలు వింటుంటే నాకు కన్నీళ్లోస్తున్నాయి. జిల్లాలో తుఫాను నష్టం తీవ్రత బయట ప్రపంచానికి తెలియలేదు. 
 
ఈ బాధ్యత జనసేన తీసుకుంటుంది. ఉద్దానంలో తుఫాన్‌ నష్టాన్ని బయట ప్రపంచానికి వీడియోల రూపంలో తీసుకువెళ్తాం. కిడ్నీ సమస్యలపై జనసేన పోరాడినట్లుగా ఇప్పుడు తితలీ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ భరోసా ఇచ్చారు. 
 
తితలీ తుఫాన్‌ కారణంగా పచ్చటి ఉద్దానం మొత్తం సర్వనాశనమైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. నేలకూలిన ఇళ్లు, తోటలు చూస్తుంటే తనకు కన్నీళ్లొస్తున్నాయన్నారు. మూడు రోజులు తాను ఉద్దానంతో పాటు ఇతర నియోజకవర్గాల్లో పర్యటిస్తానని, జరిగిన విధ్వంస నష్టాన్ని పార్టీ తరఫున నమోదు చేస్తామని వివరించారు. 
 
ఆతర్వాత రంగాల వారీగా నష్ట నివేదివను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తా నని చెప్పారు. బాధితులకు పదేళ్ల పాటు పరిహారం ఇవ్వాలని నివేదిక ఇస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి న్యాయం జరిగేలా చేస్తానని హామీ ఇచ్చా రు. పర్యటనలో తనకు చాలామంది బాధితులు సాయం విషయంలో ఫిర్యాదు చేశారని, మరికొంతమంది తాగు నీరు అందడం లేదన్నారు.