సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By srinivas
Last Updated : బుధవారం, 6 జూన్ 2018 (11:14 IST)

పవన్ కళ్యాణ్ యాత్రలో అపశృతి... ఇద్దరు మృతి

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కొనసాగిస్తున్న జనసేన పోరాట యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఈ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో వారి కుట

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ కొనసాగిస్తున్న జనసేన పోరాట యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. ఈ పర్యటన సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలి ఇద్దరు యువకులు మృతి చెందారు. దీంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
 
తమ అభిమాన హీరో పాయకరావుపేటలో పర్యటిస్తున్న నేపథ్యంలో పవన్ రాకను పురష్కరించుకుని తోళెం నాగరాజు, శివ అనే ఇద్దరు యువకులు సాయిమహల్ జంక్షన్ దగ్గర స్వాగత ఫ్లెక్సీలు కట్టేందుకు ప్రయత్నించారు. 
 
ఆ సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగెలు తగలడంతో వారు షాక్‌కు గురై మృతిచెందారు. తమ అభిమానాన్ని చాటుకునేందుకు బ్యానర్లు కడుతుండగా వీరు విద్యుత్ షాక్‌కు గురై మృతిచెందడంతో పాయకరావుపేటలో తీవ్ర విషాదం నెలకొంది.