ఆదాయపన్ను రద్దు : ఇదే మోడీ పంద్రాగస్టు దినోత్సవ కానుక?

బుధవారం, 11 జులై 2018 (12:58 IST)

కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేక నెలకొంది. దీన్ని తగ్గించే దిశగా ప్రధాని మోడీతో పాటు బీజేపీ పాలకులు చర్యలు చేపడుతున్నారు. ఇందులోభాగంగా, వచ్చే నెల 15వ తేదీన జరుగనున్న పంద్రాగస్టు వేడుకల రోజున ఆదాయపన్నును పూర్తిగా రద్దుపై ప్రధాని ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
income tax
 
దీనికి కారణాలు లేకపోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించాలంటే, కేంద్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహాన్ని చల్లార్చి ఉంది. ఇందుకోసం ప్రధాని నరేంద్ర మోడీ, సంచలన నిర్ణయాన్ని ప్రకటించనున్నారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత, కేంద్రానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరగింది. అలాగే, బ్యాంకు లావాదేవీల సంఖ్య పెరగడంతో వ్యక్తుల నుంచి ఆదాయపు పన్ను వసూళ్లను రద్దు చేయాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. 
 
ఈ సంవత్సరం ఆగస్టు 15న ఎర్రకోటపై నుంచి ప్రసంగించే వేళ, తన నోటివెంట ఈ నిర్ణయాన్ని ఆయన ప్రకటిస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి నిర్ణయాలు బాంబుల్లా పేలి, మోడీపై ప్రజా వ్యతిరేకతను పెంచగా, దాన్ని తగ్గించకుంటే, గెలుపు క్లిష్టతరమవుతుందన్న ఆలోచనలో సునామీ తరహాలో సానుకూల పవనాలు వీచేందుకు ఏం చేయాలని ఆలోచించిన కమలనాథులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు సమాచారం. దీనిపై మరింత చదవండి :  
ప్రధానమంత్రి ఆదాయపన్ను రద్దు Abolish నరేంద్ర మోడీ Prime Minister Income Tax Narendra Modi

Loading comments ...

తెలుగు వార్తలు

news

'లైఫ్ గోల్' కొట్టిన థాయ్ బాలలు... గుహలో నుంచి సురక్షితంగా తరలింపు

థాయ్‌లాండ్ బాలలు మృత్యువును గెలిచారు. గత 18 రోజులుగా కొండగుహలో చిమ్మచీకటిలో దారితెన్నూ ...

news

పరిపూర్ణానందపై పోలీసులు నగర బహిష్కరణకు అసలు కారణాలేంటి?

కత్తి మహేష్‌ను నగరం నుంచి బహిష్కరించిన తెలంగాణ పోలీసులు ఇప్పుడు పరిపూర్ణానందపైన కూడా ...

news

కన్నీటి బాధలోనూ కుమార్తె అవయవాలను దానం చేసిన తండ్రి..

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్ డెడ్ అయిన తన కూతురు అవయవాలను దానం చేశాడు ...

news

కన్నా, జగన్, పవన్‌లకు ఆ దమ్ముందా? మంత్రి నక్కా సవాల్

అమరావతి : రాష్ట్ర ప్రభుత్వం, టీడీపీకి వ్యతిరేకంగా చేస్తున్న నాటకాలను కట్టిపెట్టాలని ...