1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (10:36 IST)

ప్రజలకు ప్రధాని మరో పిలుపు: ఏప్రిల్ 5న రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులను వెలిగించండి

కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన నేపధ్యంలో జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పటికే రెండుసార్లు మాట్లాడారు. ఇప్పుడు మూడోసారి వీడియో ద్వారా సందేశాన్నిచ్చారు.
 
కరోనా వైరస్ పైన విజయం సాధిస్తామని చెప్పిన ప్రధాని ఆదివారం నాడు..అంటే ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దేశ ప్రజలంతా కరెంట్ లైట్లను 9 నిమిషాల పాటు ఆర్పేసి లాంతర్లను కానీ కొవ్వొత్తులను కానీ లేదంటే సెల్ ఫోన్ టార్చ్ లైట్లను కానీ వెలిగించాలని కోరారు. 
కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించిన తర్వాత దేశం మొత్తం ఏకమై దానిపై పోరాటం చేస్తోందన్నారు. ఈ పోరాటంలో ప్రజలు చూపిస్తున్న ఐక్యత, క్రమశిక్షణకు కృతజ్ఞతలని అన్నారు. కరోనా వైరస్ పారదోలేందుకు పాటించాల్సిన నియమాలను ప్రజలంతా ఖచ్చితంగా అనుసరించాలనీ, తద్వారా దేశం నుంచి ఈ మహమ్మారిని తరిమేయాలని పిలుపునిచ్చారు.