శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : ఆదివారం, 27 మే 2018 (13:45 IST)

సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయనున్న ఐశ్వర్యరాయ్

వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో ఐశ్వర్యరాయ్ బరిలోకి దిగనుంది. ఇంతకీ ఐశ్వర్యరాయ్ ఏంటి ఎన్నికల బరిలో పోటీ చేయడం ఏమిటనే కదా మీ సందేహం. ఈ ఐశ్వర్యరాయ్ అంటే బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కాదు. ఆర్జేడీ అధినేత లూలా

వచ్చే సార్వత్రిక ఎన్నికల బరిలో ఐశ్వర్యరాయ్ బరిలోకి దిగనుంది. ఇంతకీ ఐశ్వర్యరాయ్ ఏంటి ఎన్నికల బరిలో పోటీ చేయడం ఏమిటనే కదా మీ సందేహం. ఈ ఐశ్వర్యరాయ్ అంటే బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కాదు. ఆర్జేడీ అధినేత లూలా ప్రసాద్ యాదవ్ కోడలు, తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యరాయ్ వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికల బరిలో దిగాలన్న ఆలోచనలో ఉన్నారు.
 
బీహార్‌లోని ఛాప్రా నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై లాలూ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఐశ్వర్య ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రజలకు కోరుకుంటున్నట్లు ఆర్జేడీ నేత రాహుల్ తివారీ వెల్లడించారు. అయితే లాలూదే ఈ విషయంలో తుది నిర్ణయం అని, ఆయన ఓకే చెబితే ఛాప్రాలో ఐశ్వర్య గెలవడం ఖాయమని అన్నారు. ఇది ఇంకా ఫైనల్ కానే లేదు. కాగా, బీహార్ మాజీ సీఎం దరోగా ప్రసాద్ రాయ్ మనవరాలైన ఐశ్వర్యను ఈ నెల 12న తేజ్ ప్రతాప్ యాదవ్ పెళ్లి చేసుకున్నారు.