బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : గురువారం, 14 మార్చి 2019 (18:16 IST)

చాయ్‌కి ఐదు.. సమోసాకు ఏడు.. (Video)

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీలైనంత వరకు ప్రచారంలో ఎక్కువ పాల్గొనడంతో పాటు తమతో కలిసి వచ్చే కార్యకర్తల అవసరాలు కూడా తీరుస్తుంటారు. ఇందుకోసం అభ్యర్థులు భారీగానే ఖర్చు చేస్తుంటారు. ఈ విషయాలను, అలాగే ప్రస్తుతం మార్కెట్లో వస్తువుల ధరలను పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం (సీఈసీ) అభ్యర్థులు దేనికి ఎంత వరకు ఖర్చు చేయాలో నిర్ణయించింది. 
 
ఈసీ సూచించిన ధరల ప్రకారం అభ్యర్థులు చాయ్‌కి రూ.5, సమోసాకు రూ.7, మధ్యాహ్న భోజనానికి రూ.175, స్నాక్స్ ప్యాకెట్‌కు రూ.20, సభలకు తెచ్చే కుర్చీలకు ఒక్కోదానికి రూ.5 మాత్రమే ఖర్చు చేయాలి. 
 
విద్యుత్ బల్బ్‌కు రూ.10, జనరేటర్‌కు రోజుకు రూ.500, వీడియోకు రోజుకు రూ.700, 1000 పోస్టర్లకు రూ.400, స్టాంప్ ప్యాడ్‌కు రూ.32, కార్బన్ పేపర్ రూ.160, జెల్ పెన్ను ఒక్కోదానికి రూ.10, సంచులు ఒక్కోదానికి రూ.50, లీటరు బాటిల్ కూల్‌డ్రింక్‌కు రూ.55 వరకు ఖర్చు చేసుకోవచ్చని ఈసీ సూచించింది.