సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 26 నవంబరు 2019 (19:54 IST)

ఏడేళ్ల తర్వాత కనబడిన మాజీ లవర్, ప్రియురాలి భర్త ఏం చేశాడో తెలిస్తే షాకే

ప్రేమ. బాషా చిత్రంలో రజినీకాంత్ చెప్పినట్లు ఒక్కసారి ప్రేమ పుడితే ఇద్దరి హృదయాలు కలిసిపోతాయి. పొరబాటున వారిని విడదీసి వేరే వ్యక్తులతో పెళ్లి చేస్తే వారి హృదయాల్లో ప్రేమ అనే ముళ్లు గుచ్చుకుంటూనే వుంటాయి. జీవితాంతం వారు ఆ బాధను అనుభవించాల్సిందే. అందుకే ప్రేమికులను విడదీయవద్దు అంటాడు సూపర్ స్టార్. అలాంటి ఘటనలు చాలానే జరిగాయి. తాజాగా మరొకటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని కోలార్ పట్టణంలో జరిగింది.
 
వివరాల్లోకి వెళితే... ఏడేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన మహేష్‌తో సంగీత అనే యువతికి పెళ్లయింది. ఐతే అప్పటికే ఆమె మరో యువకుడిని ప్రేమించింది. కానీ పెద్దల నిర్ణయాన్ని కాదనలేక తన ప్రియుడిని వదిలేసి మహేష్‌తో తాళి కట్టించుకుంది. ఆ తర్వాత ఇద్దరు పిల్లలకి తల్లైంది. ఇలా ఏడేళ్లు గడిచిపోయాయి. ప్రేమికుడు కూడా ఆమె కళ్లకు కంటపడలేదు. కానీ ఇటీవలే హఠాత్తుగా అతడు ఆమెకి కనిపించాడు. 
 
అతడిని పలుకరించి వివరాలు అడిగింది. పెళ్లి చేసుకున్నావా అని అడిగితే లేదని అతడి నుంచి సమాధానం వచ్చింది. తను బ్రహ్మచారిగా మిగిలిపోయాననీ, తను ప్రేమించిన అమ్మాయిని తప్ప మరో యువతిని భార్యగా ఊహించలేక పెళ్లి చేసుకోకుండా వుండిపోయినట్లు చెప్పేసి అతడు వెళ్లిపోయాడు. ఐతే.. ఇక అప్పటి నుంచి సంగీత తన మాజీ ప్రియుడి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. తనకోసం పెళ్లి చేసుకోకుండా అలా వుండిపోయిన ప్రియుడినే పెళ్లాడాలనుకుంది. ఈ విషయాన్ని తొలుత తన తల్లిదండ్రులకు చెప్పింది. వారు మందలించి భర్త వద్దకు పంపారు. 
 
ఐనా ఆమె కళ్ల ముందు ప్రియుడే కదులుతున్నాడు. ఇక లాభంలేదని విషయాన్ని నేరుగా భర్తకే చెప్పేసింది. తన ప్రియుడు లేనిదే వుండలేనని చెప్పింది. ఆమె మాటలు విన్న మహేష్ తొలుత షాక్ తిన్నప్పటికీ మెల్లగా తేరుకుని, భార్య ఇష్టప్రకారం ప్రియుడికి ఇచ్చి పెళ్లి చేసేందుకు అంగీకరించాడు. ఇందుకుగాను ఇద్దరూ ఒకరికొకరు సమ్మతిపై విడాకులు తీసుకున్నారు. కానీ ఇద్దరి పిల్లల్ని మాత్రం తన వద్దే వుంచాలని అతడు కోరాడు. అందుకు ఆమె అంగీకరించింది. దాంతో తన ప్రియుడి చేత ఆమె మూడుముళ్లు వేయించుకుంది.