బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 24 జూన్ 2023 (13:36 IST)

మోడీ పాదాలకు నమస్కరించిన హాలీవుడ్ సింగర్... వీడియో వైరల్

Modi
Modi
అమెరికాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రధాని మోదీ అక్కడి ప్రవాస భారతీయులతో సమావేశం సందర్భంగా కొన్ని అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేశాయి. ఈ సీన్స్ చూస్తే మోదీ మేనియా మామూలుగా లేదనిపిస్తుంది. అమెరికా కాంగ్రెస్ సమావేశంలో మోదీ ప్రసంగం ఆకట్టుకుంది. 
 
ఇక ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా చివరి రోజున జరిగిన కార్యక్రమంలో.. అమెరికాకు చెందిన గాయని మేరీ మిల్‌బెన్ ప్రధాని మోదీకి పాదాభివందనం చేసి ఆయన ఆశీర్వాదం తీసుకుంది. 
 
భారతదేశం జాతీయ గీతం జనగణమన ఆలపించిన అనంతరం మేరీ మిల్‌బెన్ నేరుగా ప్రధాని మోదీ వద్దకు వచ్చి ఆయన పాదాలకు నమస్కరించింది. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.