శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : సోమవారం, 23 ఏప్రియల్ 2018 (09:19 IST)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా వీర్రాజుకే పట్టం?

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఆ పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఆ పార్టీ అధినాయకత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై సోమవారం అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర నేతలకు ఆదివారం సమాచారం అందినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 
 
దీంతో చివరివరకూ పోటీ ఇచ్చిన కన్నా లక్ష్మీనారాయణ... బీజేపీకి గుడ్‌బై చెప్పాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు కన్నాపై ఆయన అనుచరులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌ తదితర 19 అంశాల అమలుపై కేంద్రం నిర్లక్ష్యం కారణంగా టీడీపీ.. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగి.. చివరకు యేన్డీఏతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.
 
ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ తీరుపై రాష్ట్రంలో  పెద్దఎత్తున ఆందోళనలు సాగుతున్నాయి. కేంద్రం గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రానికి ఏం చేసిందో ప్రజలకు స్పష్టంగా వివరించాలని జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా నుంచి రాష్ట్ర బీజేపీకి ఆదేశాలు అందాయి. అయితే బీజేపీ నేతలు ఎన్ని చెబుతున్నా ప్రజలు నమ్మడంలేదు. ఈ పరిస్థితుల్లో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిని మార్చాలని బీజేపీ అధిష్టానం నిర్ణయించింది. ఆ ప్రకారంగా పలువురు ప్రముఖులతో సంప్రదింపులు జరిపిన తర్వాత సోము వీర్రాజు పేరును ఖరారు చేసినట్టు సమాచారం.