శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 జూన్ 2021 (10:20 IST)

పది కోడిగుడ్లు, కొంటే ఒక బ్రెడ్డు ఫ్రీ.. సైకిల్‌పై అమ్మిన సోనూసూద్ (video)

కరోనా కాలంలో పేదల పాలిట ఆపద్భాంధవుడు, రియల్ హీరో సోనూసూద్.. తాజాగా గుడ్లు, బ్రెడ్డు అ‍మ్ముతూ కనిపించాడు. ఈ మేరకు సోనూ ఓ వీడియోను సోషల్‌ మీడియాలో రిలీజ్‌ చేశాడు.
 
వలస కార్మికులను సొంత గూటికి తరలించి వారి పాలిట దేవుడిగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా సైకిల్ తొక్కుతూ గుడ్లు, బ్రెడ్డు, పావ్‌తో పాటు మరిన్ని సరుకులు అమ్ముతూ కనిపించాడు. ఈ సైకిల్‌ను సోనూ.. సూపర్‌ మార్కెట్‌గా అభివర్ణించాడు. 
 
10 గుడ్లు కొంటే ఒక బ్రెడ్డు ఫ్రీ అని ఆఫర్‌ ప్రకటించాడు. హోమ్‌ డెలివరీ కూడా ఉచితమే అని చెప్పాడు. ఇంతకీ ఇదేదో సినిమా షూటింగ్‌ అనుకునేరు, కానే కాదు.. చిరు వ్యాపారులను ప్రోత్సహించమని చెప్పేందుకు సోనూ ఈ వీడియో చేశాడు.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sonu Sood (@sonu_sood)