1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 10 జులై 2025 (13:17 IST)

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

Dosa
Dosa
సోషల్ మీడియా మూగ జీవాల వీడియోలో వైరల్ అవుతున్నాయి. ఎన్నెన్నో వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ నంది దోసె తినడం కోసం ఓ టిఫిన్ అంగటికి వస్తోంది. ఆ షాపు ఓనర్ దోసె వేసే వరకు వెయిట్ చేస్తుంది. 
 
ఆ షాపు యజమాని పెద్దగా దోసె పోసి ప్లేటులోకి తీసుకుని వచ్చి.. ఆ బసవయ్యకు తినిపిస్తున్నాడు. అంతవరకు ఎద్దు ఓపికగా వేచి వుండి.. దోసెను తింటోంది. 
 
రోజూ దోసె తినడం కోసం ఆ బసవయ్య ఆ షాపుకు వస్తోందని యజమాని అంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.