బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Updated : శనివారం, 2 మార్చి 2019 (17:06 IST)

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సర్జికల్ స్ట్రైక్స్ చీరలు

పుల్వామా దాడికి ప్రతీకారంగా బదులు తీర్చుకుంటాం అని ప్రధాని మోదీ చెప్పినట్టే భారత వాయుసేన అకస్మాత్తుగా సరిహద్దు వెంబడి ఉన్న ఉగ్రవాద క్యాంపుల మీద దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 14 న జైషే మహ్మద్ దాడిలో 40 మందికి పైగా జవాన్లు మరణించారు. ఈ దాడిని యావత్ ప్రపంచం ఖండించింది. ఈ నేపథ్యంలో ఉగ్రదాడికి నిరసనగా సర్జికల్స్ స్ట్రైక్స్ జరిగాయి. 
 
మొత్తం 12 మిరాజ్-2000 జెట్ ఫైటర్స్‌తో ఈ దాడి జరిగింది. భారత నియంత్రణరేఖ వెంబడి జైషే మహ్మద్ సంస్థకు చెందిన ఆల్ఫా-3 శిబిరాలను ధ్వంసం చేసాయి. బాలాకోట్‌తో పాటు చకోటి, ముజఫరాబాద్ వరకు సైనిక విమానాలు చొచ్చుకొని పోయి ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 300 మందికిపైగా ఉగ్రమూకలు హతమయ్యారు. 
 
ఈ నేపథ్యంలో ఈ సర్జికల్ స్ట్రైక్స్‌పై చీరలు వచ్చేశాయి. చీరలంటే మహిళలకు ఎంతో ఇష్టం కావడంతో.. దీన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాపారస్తులు సర్జికల్ స్ట్రైక్స్ చీరలను డిజైన్ చేస్తున్నారు. మహిళలను ఆకట్టుకునేలా డిజైన్ చేసి వ్యాపారం పెంచుకుంటున్నారు. సరిహద్దులో భారత సైనికుల పోరాటం సూరత్‌కు చెందిన వినోద్ కుమార్ అనే ఓ చీరల వ్యాపారిని కదిలించింది. 
 
బాలాకోట్‌లో భారత్ జరిపిన మెరుపుదాడులతో సర్జికల్ స్ట్రైక్ చీరలు తయారు చేశారు. ఈ చీరలపై ప్రధాని మోడీతో పాటు... మిరేజ్ యుద్ధవిమానాలు, భారత సైనికుల్ని ముద్రించారు. ప్రస్తుతం ఈ చీరల డిజైన్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.