గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 17 మే 2023 (15:43 IST)

సీఎం జగన్‌ చెప్పుల ధర రూ.1.35 లక్షలు.. పేలుతున్న మీమ్స్, ట్రోల్స్

Jagan Chappals
Jagan Chappals
ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ విమర్శలు గుప్పిస్తోంది. ఆయన పాలనపై దుమ్మెత్తిపోస్తోంది. 2024 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లవచ్చనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న తరుణంలో టీడీపీ ఆఫ్‌లైన్‌లోనూ, ఆన్‌లైన్‌లోనూ దాడిని మరింత ఉధృతం చేసింది.
 
సీఎం జగన్‌ను, జగన్ పరివారాన్ని టార్గెట్ చేయడంలో టీడీపీ సోషల్ మీడియాను ఎంచుకుంది. తాజాగా సీఎం జగన్ చెప్పుళ్ల ఖర్చు ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది. ఎల్‌విఎంహెచ్ యాజమాన్యంలోని ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన బెర్లూటీ చెప్పులుగా సీఎం జగన్ చప్పల్స్ బ్రాండ్‌ను నెటిజన్లు గుర్తించారు. 
 
సీఎం జగన్ చెప్పుల ధర 6153 సౌదీ రియాల్స్ అంటే 1.35 లక్షలకు పైగా భారతీయ కరెన్సీగా అంచనా వేయబడింది. సీఎం జగన్ చెప్పుల ఫోటోలు ఆన్‌లైన్‌లో మీమ్స్, ట్రోల్స్‌తో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. ప్యాకేజ్డ్ హిమాలయన్ వాటర్ బాటిల్స్ తాగుతూ చంద్రబాబుపై వైసీపీ గతంలో చేసిన ట్రోల్స్‌కి కొందరు దీన్ని లింక్ చేస్తున్నారు.
 
"చంద్రబాబు రూ.60 హిమాలయన్ వాటర్ బాటిల్స్ తాగారని వైఎస్సార్సీపీ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శించారు. రూపాయి జీతం తీసుకుంటున్న సీఎం జగన్ రూ.1.35 లక్షల చెప్పులు వాడుతున్నారు" అని టీడీపీ సోషల్ మీడియా కార్యకర్త ఆన్‌లైన్‌లో వ్యాఖ్యానించారు. 
 
నారా లోకేష్ తన యువ గళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో టీడీపీ నేతలు, పార్టీ కార్యకర్తలు వైసీపీ ప్రభుత్వంపై, నేతలపై మాటల దాడికి దిగారు. సీఎం జగన్ చెప్పుల ఫోటోలు ఆన్‌లైన్‌లో మీమ్స్, ట్రోల్స్‌తో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.