శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 22 ఆగస్టు 2020 (15:57 IST)

చైనాకు షాకిచ్చిన భారతీయ రైల్వే : వందే భారత్ రైళ్ల టెండర్లు రద్దు

చైనాకు భారత్ మరోమారు షాకిచ్చింది. అయితే, ఈ దఫా షాకిచ్చింది కేంద్ర ప్రభుత్వం కాదు. భారతీయ రైల్వే. వందే భారత్ కింద 44 సెమీ హైస్పీడ్ రైళ్ళ తయారీ కోసం ఇచ్చిన టెండర్లను రద్దు చేసినట్టు భారతీయ రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. 
 
'వందే భారత్'లో భాగంగా 44 సెమీ హైస్పీడ్‌ రైల్వే తయారీకి ఇచ్చిన టెండర్లను రద్దు చేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. వారం రోజుల్లోగా మళ్లీ టెండర్లు పిలిచి ఖరారు చేస్తామని, కేంద్రం చేపట్టిన మేక్‌‌ఇన్‌ ఇండియాకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు' ప్రకటించింది. 
 
ఈ నిర్ణయంతో చైనాకు మరో దెబ్బ తగిలినట్లయింది. చైనా జాయింట్ వెంచర్, సీఆర్‌ఆర్‌సీ పయనీర్‌ ఎలక్ట్రిక్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ 44 సెట్ల సెమీ హైస్పీడ్ రైళ్లను సరఫరా చేసే ఆరుగురు పోటీదారుల్లో ఏకైక విదేశీ బిడ్డర్‌గా ఉంది. 'సెమీ హైస్పీడ్‌ రైలు 44 సెట్ల (వందేభారత్‌) తయారీ టెండర్‌ రద్దయింది. సవరించిన పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌ (మేక్‌ ఇన్‌ ఇండియా ప్రాధాన్యత) ఆర్డర్‌ ప్రకారం వారం రోజుల్లోగా తాజాగా టెండర్‌ ఇవ్వనున్నట్లు' రైల్వే మంత్రిత్వశాఖ ట్వీట్‌ చేసింది.