శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 మే 2022 (21:37 IST)

శ్రీవారికి ఈ సహోదరులు ఎలా మొక్కు తీర్చుకున్నారంటే?

Tirumala
Tirumala
కలియుగ వైకుంఠం శ్రీ వేంకటేశ్వర ఆలయానికి చాలామంది భక్తులు మొక్కులతో చేరుకుంటూ ఉంటారు. అందులో ప్రధానంగా కాలినడకన వస్తుంటారు. అందుకోసం భక్తులకు అలిపిరి అలాగే శ్రీవారి మెట్టు మార్గం అందుబాటులో ఉంటుంది. 
 
ఈ రెండు మెట్టు మార్గాల్లో నడిచి వచ్చే భక్తులు రకరకాల మొక్కులతో కాలి నడకను ప్రారంభిస్తారు. ఒకరు మోకాలితో నడిస్తే మరొకరు పొర్లు దండలు చేస్తూ పైకి చేరుకుంటారు. ఇంకొకరు మెట్టు మెట్టుకు పసుపు కుంకుమ రాస్తూ కర్పూరం వెలిగించుకుంటు వెళ్తారు.
 
అయితే  ఇద్దరు సహోదరులు మెట్టు మెట్టుకు కర్పూరాన్ని వెలిగించుకుంటూ వెళ్తున్న విధానాన్ని చూసి ముక్కున వేలు వేసుకుంటున్నారు కొందరు భక్తులు. ఓ గరాటుకు అమర్చిన పైపు ద్వారా, ఒంగకుండానే ఒకరు కర్పూరాన్ని మెట్టుపై ఉంచుతుండగా, ఇంకో వ్యక్తి మాత్రం పొడుగాటి కర్రకు మంట వెలిగించి ఆ కర్పూరాలను అంటించుకుంటూ వెళ్తున్నాడు.
 
కొందరు భక్తులు ఈ ఐడియా బాగానే ఉందని మెచ్చుకుంటున్నారు. ఇంకొందరు మాత్రం కష్టపడి చెల్లించే మొక్కుబడిని కూడా వారి అవసరానికి, సుఖానికి కష్టం లేకుండా చెల్లించే స్థాయికి భక్తుల ఆలోచలు వచ్చాయి అంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా వీరి ఇద్దరికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది.