గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : సోమవారం, 20 డిశెంబరు 2021 (09:59 IST)

మంకీ వర్సెస్ డాగ్స్ గ్యాంగ్ వార్: 250 కుక్కలను చంపిన రెండు కోతులు

మహారాష్ట్రలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. లావూల్ గ్రామంలో దాదాపు 250 కుక్కలను చంపినందుకు రెండు కోతులను పట్టుకున్నారు. 250 కుక్కలను ఆ కోతులు ఎందుకు చంపాయా అన్న దానికి కారణం లేకపోలేదు.
 
కొన్ని రోజుల క్రితం ఈ ప్రాంతంలో కుక్కలు ఒక కోతిని వెంటాడి వెంటాడి చంపేశాయి. ఆ దారుణాన్ని ఈ 2 కోతులు చూసాయట. ఇక ఆ తర్వాత ప్రతీకారంగా కుక్కలు వంటరిగా వున్నప్పుడు దాడి చేసి చంపుతూ వచ్చినట్లు తెలుస్తోంది. ముఖ్యమంగా కుక్కపిల్లలు కనబడితే చటుక్కున చేతులతో పట్టుకుని చెట్లపైకి చిటారు కొమ్మల వద్దకు తీసికెళ్లి అక్కడి నుంచి వాటిని జారవిడిచి అవి ప్రాణాలు కోల్పోయేట్లు చేసాయి.

కోతులు ఇలా ప్రతీకారం తీర్చుకోవడాన్ని చూసిన గ్రామస్థులు విషయాన్ని అటవీశాఖ దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన అధికారులు ఆ కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో వదిలేసారు.