గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 27 జులై 2022 (21:05 IST)

దేశం మీద బాంబులు పడుతుంటే భార్యతో ఫోటో షూటా?: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఆగ్రహం

Ukraine President Volodymyr Zelensky and his wife Olena Zelenska
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వోలోడిమిర్ జెలెన్స్కీ, ఆయన భార్య ఒలెనా జెలెన్స్కా పాపులర్ వోగ్ మ్యాగజైన్ కవర్ స్టోరీకి ఫోజులిచ్చారు. ఈ ఫోటో షూట్ ఇవ్వడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ దేశం పైన బాంబులు వర్షం పడుతుంటే అధ్యక్షుడు ఇలా ఫోటోలు దిగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఐతే మరికొందరు అధ్యక్షుడు చేసిన దాంట్లో తప్పేమీ లేదంటూ వెనకేసుకొస్తున్నారు.

 
ఉక్రెయిన్ అధ్యక్షుడు, ఆయన భార్య వోగ్ బృందంతో వ్యక్తిగత ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో యుద్ధం 150 రోజులకు పైగా కొనసాగుతోందనీ, వేలాది మంది ప్రాణాలను బలిగొన్నట్లు చెప్పుకొచ్చారు. కాగా వోగ్ పత్రిక ముఖచిత్రంపై ఫోటో రావడం అంటే అది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటుందనీ, తమలాగే తమ దేశ ప్రజల మహిళామణులందరికీ ఈ అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు ఆమె తన ఇన్‌స్టాగ్రాంలో వెల్లడించారు.
 
ఒలెనా జెలెన్స్కా షేర్ చేసిన చిత్రాలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. చాలామంది యూజర్లు డిజిటల్ కవర్‌ను అందమైనదిగానూ, శక్తివంతమైన చిత్రం అని పేర్కొన్నారు. అయితే, తమ దేశం యుద్ధంతో నాశనమవుతున్న సమయంలో ఈ జంట ఒక పత్రిక కోసం ఫోజులిచ్చారని మరికొందరు విమర్శించారు.