గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 ఏప్రియల్ 2023 (15:25 IST)

ఢిల్లీ మెట్రోలో టూపీస్ కాదు గోచితో మహిళ.. వీడియో వైరల్.. DMRC సీరియస్

Delhi Metro
Delhi Metro
ఢిల్లీ మెట్రో కోచ్‌లో కురుచ దుస్తులు ధరించి ప్రయాణిస్తున్న ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తేదీ లేని ఈ షార్ట్ క్లిప్‌లో, ప్రయాణీకురాలు ఒక కోచ్ లోపల ఇతర మహిళా ప్రయాణీకుల పక్కన కూర్చుని, నిలబడటం నడవడం చేసింది. 
 
ఇలా చేసే సమయంలో ఆమె టూపీస్ ధరించిందని తెలుస్తోంది. ఈ వీడియోపై ఢిల్లీ మెట్రో స్పందిస్తూ, ప్రయాణికులు ప్రోటోకాల్‌లను అనుసరించాలని ఆశిస్తున్నట్లు పేర్కొంది.
 
ప్రయాణికులు ఇతర ప్రయాణీకుల సున్నితత్వాన్ని కించపరిచేలా ఎలాంటి కార్యకలాపాల్లో పాల్గొనకూడదు లేదా ఎలాంటి దుస్తులు ధరించకూడదు. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ సెక్షన్ 59 ప్రకారం అసభ్యతను శిక్షార్హమైన నేరంగా పేర్కొంది.
 
DMRC పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించేటప్పుడు డెకోరమ్‌ను కొనసాగించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసింది. ఈ వీడియో వాస్తవానికి NCMindia కౌన్సిల్ ఫర్ మెన్ అఫైర్స్ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా భాగస్వామ్యం చేయబడింది.