శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (20:12 IST)

బాలుడిని కాటేసిన పాము.. చివరికి ఏమైందంటే?

Snake
పాములు ప్రమాదకరమైనవే. కాటేస్తే గంటల వ్యవధిలోనే చనిపోవడం ఖాయం. కానీ బీహార్‌లో ఓ విచిత్ర ఘటన జరిగింది. నాగు పాము కాటేసినా ఓ బాలుడికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. కానీ ఆ కాటేసిన పాము మాత్రం క్షణాల్లోనే చనిపోవడం విచిత్రంగా మారింది.
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని మాధోపూర్ గ్రామానికి చెందిన అనూజ్ (4) తన మామ ఇంటికి వెళ్లాడు. బుధవారం సాయంత్రం అక్కడ పిల్లలతో ఆడుకుంటుండగా పొలం వైపు నుంచి ఓ విషపూరితమైన నాగు పాము వచ్చి పాదంపై కాటు వేసింది. 
 
అయితే అది గమనించిన స్థానికులు బాలుడి కుటుంబానికి సమాచారం అందించారు. ఆ పామును చంపడానికి దాని వెనకాల పరుగులు తీశారు. కానీ, అందరూ పాము వద్దకు చేరుకునేలోపు అది చనిపోయింది. 
 
ఈ విషయాన్ని తెలుసుకున్న కుటుంబీకులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. వైద్యులు బాలుడికి చికిత్స అందించి పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు తెలిపారు. 
 
పాము కాటుకు గురైన అనూజ్‌కు ఏమి కాకపోవడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. కానీ పాము చనిపోవడం మిస్టరీగా మారింది.