గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 14 మార్చి 2023 (17:43 IST)

పైనాపిల్స్‌ను ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు.. వీడియో వైరల్

pineapple
పైనాపిల్స్ రుచికరమైన పండ్లలో ఒకటి. పైనాపిల్ తీపిగా పుల్లని రుచితో కూడినదిగా వుంటుంది. అయితే పైనాపిల్స్ కట్ చేయడం చాలా సులభం కాదు. సరైన విధానంలో దాన్ని కట్ చేయాలి. అందుకే కొందరు దుకాణాలు, మార్కెట్ల నుండి ప్రీ-కట్ పైనాపిల్ ముక్కలను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. 
 
అయితే, ఇటీవలి ఇన్‌స్టాగ్రామ్ రీల్ పైనాపిల్ కట్ చేసుకోవాలనే ఆసక్తిని పెంచవచ్చు. 'హౌ టు ఈట్ పైనాపిల్ లైక్ ఎ ప్రో' అనే శీర్షికతో తాజా వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 
 
ఈ వీడియోకు 20 మిలియన్ కంటే ఎక్కువ వ్యూస్ లభించాయి. ఈ రీల్‌ను ఒక వీడియో సృష్టికర్త అతని పేజీ @foodiechina888లో పోస్ట్ చేశారు. ఈ "ఫూల్‌ప్రూఫ్ ట్రిక్" చైనాలో బాగా ట్రెండ్ అవుతోంది. 
 
ఈ వీడియోలో, ఓ వ్యక్తి పైనాపిల్ పైభాగాన్ని, దిగువ భాగాన్ని సులభంగా కత్తిరించడం చూడవచ్చు. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.