సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 10 మే 2023 (17:23 IST)

కర్ణాటక ఎన్నికలు.. పెళ్లి దుస్తులు.. ఓటేసిన వధువు

marriage
224 నియోజకవర్గాలున్న కర్ణాటకలో నేడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఏడు గంటలకు ఓటింగ్ ప్రారంభం కావడంతో వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, సామాన్యులు ఓటు వేస్తున్నారు. 
 
ఉదయం 9 గంటల వరకు 7.55 శాతం ఓట్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో ఓ వధువు ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి ప్రవేశించింది. 
 
చిక్కమగళూరు జిల్లా మూడికెరె అసెంబ్లీ నియోజకవర్గంలోని మాకోనహళ్లి ప్రాంతంలో మనకోళానికి చెందిన ఈ మహిళ పెళ్లి దుస్తులతో ఓటేయడం అక్కడున్న అధికారులను ఆకట్టుకుంది.