మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (16:48 IST)

కొండచిలువను చూసి జడుసుకున్న పులి

ఓ పులి కొండచిలువను చూసి జడుసుకుంది. అవును ఇది నిజమే. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో కొండచిలువకు భయపడి తోక ముడిచింది.
 
వివరాల్లోకి వెళితే.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పులి అడవిలోని దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఉన్నట్టుండి ఓ భారీ కొండచిలువ అడ్డుగా వస్తుంది. 
 
పులిని గమనించగానే కొండచిలువ దారి మధ్యలో ఆగిపోతుంది. దీంతో ఒక్కసారిగా పులి భయపడిపోతుంది. కాసేపు అటు, ఇటు తిరుగుతూ గమనిస్తుంది. కొండచిలువ కూడా పులి వైపు తల తిప్పుతుంది. 
 
దీంతో పులి '' దీంతో మనకెందుకు వచ్చిన గొడవ''.. అనుకుంటూ వెనక్కు తగ్గుతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ఎప్పుడో పోస్టు చేసినా.. ప్రస్తుతం సోషల్ మీడియా షేక్ అవుతోంది.