శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 24 జులై 2022 (13:22 IST)

శరవేగంగా మంకీపాక్స్ కేసులు - అత్యయిక పరిస్థితి

monkeypox
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు శరవేగంగా వ్యాపిస్తున్నయి. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమై, ఆరోగ్య అత్యయిక పరిస్థితిని వెల్లడించింది. ఈ వైరస్ ఇప్పటికే 70కి పైగా దేశాలకు వ్యాపించింది. ఈ దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. వాటిలో భారత్ కూడా ఒకటి. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యయిక పరిస్థితిని విధించింది. 
 
ఈ తరహా ఆరోగ్య ఎమర్జెన్సీని విధంచడం ద్వారా గణనీయ స్థాయిలో ప్రభావం కలిగించే ముప్పుగా మంకీపాక్స్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిగణిస్తుంది. తద్వారా అంతర్జాతీయ సమాజం నుంచి సహకారం కోరే వీలుటుంది. యూరప్ దేశాలను ఈ కొత్త వైరస్‌కు జన్మస్థానంగా భావిస్తున్నారు. 
 
స్వలింగ సంపర్కుల్లో ఈ వైరస్ అత్యంత ప్రభావం చూపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కాగా, ఇప్పటివరకు 70కి పైగా దేశాల్లో దాదాపు 61 వేల మంకీపాక్స్ కేసులు నమోదైవున్నాయి. జూన్ చివరి నుంచి జులై తొలివారం వరకు ఈ వైరస్ వ్యాప్తి ఏకంగా 75 శాతానికిపైగా పెరిగడం గమనార్హం.