గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 27 జులై 2021 (20:18 IST)

భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, ఏంటండీ ఈ దారుణం?

అశ్లీల చిత్రాల కేసులో నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాను అరెస్టు చేయడంపై మరో బాలీవుడ్ నటుడు, కమెడియన్ సునీల్ మద్దతు తెలిపాడు. అతడిని అరెస్టు చేసిన పోలీసులకు తన పూర్తి మద్దతు తెలుపుతున్నానంటూ చెప్పాడు. అంతేకాదు... ఇలాంటి పనికిమాలిన చిత్రాలను తీసేవారు ఎవరయినా సరే వదిలిపెట్టకూడదంటూ విజ్ఞప్తి చేశాడు.
 
పనిలోపనిగా బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ పైన విరుచుకుపడ్డాడు. ఓ సీనియర్ నటుడు అయి వుండి చెత్త వెబ్ సిరీస్ తీస్తున్నాడనీ, అతడు నటించిన ఫ్యామిలీ మెన్ చూస్తే సమాజంలో అది ఎంత చెడును చేస్తుందో తెలుస్తుందన్నారు. 
 
అందులో భార్యకు వివాహేతర సంబంధం, భర్తకు మరో మహిళతో ఎఫైర్, మైనర్ బాలికకు బోయ్ ఫ్రెండ్, బాలుడు తన వయసుకి మించి ప్రవర్తించడం.. ఇలాంటి వెబ్ సిరీస్ తీసి ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. వీటిపై కూడా నిషేధం విధించాలి, అసలు మనోజ్ బాజ్ పాయ్ లాంటి నీచుడిని నేను చూడలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసాడు.