శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: బుధవారం, 28 ఆగస్టు 2019 (14:03 IST)

బ్యాడ్మింటన్ కప్ గెలవడమంటే ఏంటో ఇది చూస్తే మీకే తెలుస్తది... సింధుపై ఆనంద్ మహీంద్ర

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా వుండే ఆనంద్ మహీంద్ర మరోసారి ట్విట్టర్ వేదికగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు విజయంపై పొగడ్తల జల్లు కురిపించారు. ఈ సందర్భంగా సింధూ చేస్తున్న వర్కవుట్ వీడియోను పోస్ట్ చేసి... నేను దీన్ని చూసి చూసి అలసిపోయాను. కానీ ఇప్పుడు ఆమె ప్రపంచ ఛాంపియన్. 
 
దీన్ని చూసిన తర్వాత కూడా ఆమె ఎలా ఛాంపియన్ అయ్యింది అనే దానిపై ఇక ఎవ్వరకీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. భారతదేశం లోని వర్ధమాన భారతీయ క్రీడాకారులు ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతారు. అగ్రస్థానానికి రావాలంటే ఇంతకన్నా అకుంఠిత దీక్ష ఇంకేముంటుందీ అని పేర్కొన్నారాయన.
 
కాగా వరల్డ్ బ్యాడ్మింటన్ పోటి తుది పోరులో విశ్వవిజేతగా నిలిచింది హైదరాబాద్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఢిల్లీకి చేరుకున్న ఆమె మొదట కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా సింధును అభినందించిన రిజిజు, సింధు స్ఫూర్తితో మరింత మంది బ్యాడ్మింటన్ క్రీడలోకి ప్రవేశించాలని పిలుపునిచ్చారు.
 
ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలుసుకున్న సింధు, అటునుంచి హైదరాబాద్‌కు చేరుకుంది. అంతకుముందు ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, 'ఓ భారతీయురాలిని అయినందుకు ఎంతో గర్వంగా ఉంది. ఇదో గొప్ప మెడల్. నాకు ప్రతి క్షణమూ సహకరించిన కోచ్‌కి కృతజ్ఞతలు' అని వ్యాఖ్యానించింది.