చీరకట్టులో ఉన్న అందమే వేరు.. కానీ చీరలో అర్ధనగ్నంగా కనిపించి పరువు తీసింది.. (video)
చీరకట్టులో ఉన్న అందం.. ఏ డ్రెస్ వేసుకున్నా రాదు. చీర అంటే ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. చీరను రకరకాల స్టైల్‌లో కట్టుకుని అందంగా రెడీ అవుతుంటారు చాలామంది మహిళలు. పండగైనా, ఫంక్షన్ అయినా, శుభకార్యం అయినా.. అందంగా, ప్రత్యేకంగా, సంప్రదాయంగా కనిపించాలంటే చీర కట్టాల్సిందే.
చీరకట్టు భారతీయ సంస్కృతికి అద్దం పట్టే అలంకరణ. అయితే ఈ చీరకట్టుతో విదేశాల్లోనూ వావ్ అనిపించేలా చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లు చేసి వున్నారు.
కానీ ఓ మహిళ మాత్రం చీరకట్టుకు అవమానం తెచ్చేలా చేసింది. చీరకట్టుకుని అర్ధనగ్నంగా కనిపించింది. అది కూడా విదేశంలో భారత పరువు తీసింది.
చీర కట్టుకుని, అర్థనగ్నంగా బికీనీలో కనిపించింది. కొత్త ఫ్యాషన్ చీర అంటూ విదేశాల్లోని ఓ గల్లీలో… తిరుగుతూ రచ్చ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆ మహిళపై జనాలు ఫైర్ అవుతున్నారు. చీరకట్టులో భారత పరువు తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.