శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఎం
Last Updated : ఆదివారం, 8 మార్చి 2020 (14:37 IST)

జగన్ విజయం వెనుక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే (video)

ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందంటారు. మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారి వెనుక ఉన్న ఆ స్త్రీ మూర్తులు వీరే' అంటూ వైసీపీ తమ అధికారిక ట్విట్టర్‌ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ వీడియో రూపొందించింది.
 
రాజకీయ పరంగా జగన్‌ను ఇబ్బందులకు గురి చేశారని, ఆ సమయంలో ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల, భార్య భారతి ఆయనకు అండగా నిలిచారని అందులో తెలిపారు. 'నేను మీ రాజన్న బిడ్డను.. జగనన్న విడిచిన బాణాన్ని' అంటూ వైఎస్ షర్మిల... జగన్‌ జైలులో ఉన్నప్పుడు చేసిన ప్రచారాన్ని గుర్తు చేశారు.