శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 28 జనవరి 2020 (19:25 IST)

రంజితపై పరుచూరి వ్యాఖ్యలు.. వైరల్... రంజితను ఆ భజనలకు వెళ్ళొద్దని?

సినీనటి రంజితను రచయిత పరుచూరి గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే.. ఆయనే రంజితను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేశారు. రంజిత ప్రస్తుతం ఎక్కడో తలదాచుకుంటుందని తెలిసి బాధపడ్డానని పరుచూరి అన్నారు. ఒక్కసారి తాను పిలిస్తే వెనక్కి తిరిగి కళ్లు ఎగరేసిందని.. అప్పుడే వాళ్ళ నాన్నను కలిసి మీ అమ్మాయిని నటిని చేయమని అడిగానని.. ముందు వాళ్లు వద్దన్నా తర్వాత ఒప్పుకున్నారని పరుచూరి అన్నారు. అప్పుడు రంజిత తన దగ్గరికి వచ్చి చిన్న పిల్లలా థ్యాంక్స్ అంకుల్ అని చెప్పిందన్నారు. 
 
తొలి చిత్రం ఆడకపోయినా.. తర్వాత అద్భుతమైన వేషాలు వేసి మంచి స్థాయికి వెళ్లిందని చెప్పారు. విచిగురు లాంటి సినిమాలు ఈమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. రంజిత తననెప్పుడూ ఓ తండ్రిలా చూసుకుందని చెప్పాడు పరుచూరి. 1995లో తాను ఓ డ్రామా కోసం అమెరికా వెళ్లాల్సి వచ్చినపుడు తనకు తోడుగా రంజితకు తీసుకెళ్లానని.. అప్పుడే ఆమె తొలిసారి అమెరికా వచ్చిందన్నారు. వీసా వచ్చింది కూడా అప్పుడే అని గుర్తు చేసుకున్నారు పరుచూరి. ఆ రోజు తనను నిత్యానంద భజనలకు వెళ్లకమ్మా అని చెప్పి ఉంటే బాగుండేదేమోనని బాధపడ్డారు.
 
ఏ రోజైతే నిత్యానంద, రంజితల వీడియోలు చూసానో ఆ రోజే తను చాలా బాధపడ్డానని, ఓ తండ్రి ఎంత బాధపడతాడో అంతకంటే ఎక్కువగా తన గుండె బాధపడిందని చెప్తున్నారు. బంగారు మనసున్న అమ్మాయి అలాంటి ఆధ్యాత్మికత వైపు వెళ్లిపోయిందని.. తాను రంజిత మంచి నటి అవుతుందని అనుకున్నాను కానీ ఇలా అయిపోతుందని ఎప్పుడూ అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు పరుచూరి. ప్రస్తుతం పరుచూరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.