శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 నవంబరు 2021 (11:06 IST)

కుప్పంలో బాబును కుమ్మేస్తున్న వైసిపి, దర్శిలో ఫ్యానుకి ఎదురుగాలి

కుప్పం అంటేనే కేరాఫ్ చంద్రబాబు నాయుడు. ఇది ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న చరిత్ర. కానీ తాజాగా జరిగిన కుప్పం మునిసిపల్ ఎన్నికల్లో వైసిపి ముందంజలో వుంది. ఈరోజు ఓట్ల లెక్కింపులో మెజారిటీ స్థానాల్లో వైసిపి దూసుకెళ్తోంది. దీనితో చంద్రబాబు కుప్పం చరిత్ర తలక్రిందులైనట్లవుతోంది.

 
మరోవైపు రాష్ట్రంలో జరిగిన ఇతర చోట్ల కూడా వైసిపిదే హవా. మెజారిటీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో వున్నారు. గుంటూరు దాచేపల్లి మునిసిపాలిటీని వైసిపి కైవసం చేసుకుంది. 20 వార్డులకు గాను వైసిపి 11, తెదేపా 7, జనసేన 1, వైసిపి రెబల్ అభ్యర్థి ఒకటి కైవసం చేసుకున్నారు. కాగా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా హవా సాగుతోంది.