స్పెషల్ స్టేటస్ డిమాండ్ : వైకాపా ఎంపీల రాజీనామాలు ఆమోదం
వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు
వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలు చేసిన రాజీనామాలపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదముద్రవేశారు. విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న ప్రధాన డిమాండ్‌తో ఈ ఐదుగురు ఎంపీలు రాజీనామాలు చేసిన విషయం తెల్సిందే.
వాస్తవానికి ఈ రాజీనామాలు గత ఏప్రిల్ 6వ తేదీన చేశారు. ఆ తర్వాత ఈ రాజీనామాలను పరిశీలించిన లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్... ఆ ఐదుగురు ఎంపీలను పిలిచి ప్రత్యేకంగా మాట్లాడారు. అపుడు కూడా రాజీనామాలకు కట్టుబడివున్నట్టు వారు తెలిపారు.
ఈ నేపథ్యంలో వారి రాజీనామాలను స్పీకర్ గురువారం ఆమోదించారు. ఈ రాజీనామాలు చేసిన వారిలో వైవీ సుబ్బారెడ్డి (ఒంగోలు), వరప్రసాద్ (తిరుపతి) మేకపాటి రాజమోహన్ రెడ్డి (నెల్లూరు), మిథున్ రెడ్డి (రాజంపేట), వైఎస్ అవినాష్ రెడ్డి (కడప)లు ఉన్నారు. అయితే, వీరి రాజీనామాలు ఆమోదించినప్పటికీ.. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహంచే అవకాశం లేదు.