శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. టీవీ టైమ్
  3. వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 26 ఏప్రియల్ 2017 (21:16 IST)

ఏపీ టెలివిజన్ నంది అవార్డుల ప్రకటన

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. 2012, 2013 సంవత్సరాలకు గానూ టెలివిజన్ నంది అవార్డులను ప్రకటించింది. బుధవారం సచివాలయంలో ఎంపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో అవార్డు విజేతలను ప్రకటించారు. 2012 సంవత్సరానికి 99 దరఖాస

విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్.. 2012, 2013 సంవత్సరాలకు గానూ టెలివిజన్ నంది అవార్డులను ప్రకటించింది. బుధవారం సచివాలయంలో ఎంపీ మురళీమోహన్ ఆధ్వర్యంలో అవార్డు విజేతలను ప్రకటించారు. 2012 సంవత్సరానికి 99 దరఖాస్తులు రాగా.. వాటిని పరిశీలించిన జి.వి.నారాయణరావు నేతృత్వంలోని 12 మంది సభ్యుల కమిటీకి.. విజేతలను ఎంపిక చేసింది. 
 
2013 సంవత్సరానికి గానూ మొత్తం 104 దరఖాస్తులు రాగా.. వాటిని డి.కవిత ఆధ్వర్యంలోని 11 మంది సభ్యుల కమిటీ పరిశీలించి.. విజేతలను ప్రకటించింది. రాష్ట్ర విభజన, రాజధాని ఎంపిక, నిర్మాణం వంటి సమస్యల కారణంగా గత ఐదేళ్లుగా టీవీ నంది అవార్డుల ప్రకటన ఆలస్యమైందని మురళీమోహన్ అన్నారు. 2012, 13 సంవత్సరాలకు అవార్డుల ఎంపిక పూర్తయిందని.. 2014, 15, 16 సంవత్సరాలకు గానూ అవార్డుల ఎంపిక కమిటీలు ఇప్పటికే వేశామని.. జూన్ నెలాఖరుకు విజేతలను ప్రకటిస్తామని చెప్పారు. ఐదేళ్లకు విజేతల ఎంపిక పూర్తయిన తరువాత.. భారీస్థాయిలో అవార్డుల ఫంక్షన్ నిర్వహిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని మురళీమోహన్ అన్నారు. 
 
2012  సంవత్సరానికి ప్రకటించిన అవార్డులు                  2013 సంవత్సరానికి అవార్డులు
బెస్ట్ టెలీ ఫిల్మ్ : ఇంద్రజిత్                                      గోదా కల్యాణం
టీవీ ఫీచర్ ఫిల్మ్ : ఎందరో మహానుభావులు                    సుఖీభవ
టీవీ మెగా సీరియల్ : పండు మిరపకాయ్                        పురాణగాధలు
టీవీ డైలీ సీరియల్ : కాంచనగంగ                                పుట్టింటి పట్టుచీర
టీవీ చిల్ర్డన్ ఫిల్మ్ : గాయాల చెట్టు                                  బాలబడి 
టీవీ డాక్యుమెంటరీ ఫిల్మ్ : కంచి పరమాచార్య                    హరికథ
టీవీ సోషల్లీ రిలవెంట్ ఫిల్మ్ : తొలి అడుగు                         జ్యోతీరావ్ పూలే 
టీవీ ఎడ్యుకేషనల్ ఫిల్మ్ : అన్వేషకులు                           బయోటెక్నాలజీ 
బెస్ట్ డైరెక్టర్ : కె.వి.రెడ్డి (కుంకమరేఖ)                            మలినేని రాధాకృష్ణ 
అచ్చుత్ అవార్డ్ : అనిల్ (మనసుమమత)                      ప్రీతం 
బెస్ట్ లీడింగ్ యాక్ర్టెస్ : ఎస్.భావన (కాంచనగంగ)             యామిని (పుట్టింటి పట్టుచీర)
బెస్ట్ విలన్ : భువనేశ్వరి (కుంకమరేఖ)                             రామకృష్ణ (శ్రావణ సమీరాలు) 
బెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ : బి.శ్రావణభాస్కర్ రెడ్డి (పసుపు కుంకుమ)   ఎన్. చిరంజీవి (పసుపు కుంకమ)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ : కొమ్మనాపల్లి గణపతిరావు (అభిషేకం)      వల్లభాచార్యులు (సతీసావిత్రి) 
బెస్ట్ స్టోరీ రైటర్ : దాసరి నారాయణరావు (అభిషేకం)               అన్నపూర్ణ స్టూడియోస్ 
బెస్ట్ మేల్ న్యూస్ రీడర్ : పారుపల్లి భోగేంద్రనాధ్ (ఎన్ టీవీ)        సీహెచ్.వి.ఎల్.ఎన్.శర్మ (ఈటీవీ2)
బెస్ట్ ఫీమేల్ న్యూస్ రీడర్ : కోటా మాధవీలత (దూరదర్శన్)        ఎస్.రోజా (ఐ న్యూస్)