Widgets Magazine

బడ్జెట్‌ 2018 తర్వాత ధరలు తగ్గేవి... ధరలు పెరిగేవి ఏమిటి?

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చప్పగా ఉందనీ విపక్ష పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటే, ఇది రైతు సంక్షేమ బడ్జెట్ అంటూ ప్రధానమంత్రి

arun jaitley
pnr| Last Updated: గురువారం, 1 ఫిబ్రవరి 2018 (16:14 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2018-19 సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ చప్పగా ఉందనీ విపక్ష పార్టీల నేతలు వ్యాఖ్యానిస్తుంటే, ఇది రైతు సంక్షేమ బడ్జెట్ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. అధికార బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈనేపథ్యంలో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చే ఈ బడ్జెట్ తర్వాత ధరలు తగ్గేవి ఏమిటి, ధరలు పెరిగేవి ఏమిటి అనే అంశాన్ని పరిశీలిస్తే, ఈ బడ్జెట్‌లో కస్టమ్స్ డ్యూటీ తగ్గించడం వల్ల జీడిపప్పు ధర తగ్గనుంది. అలాగే, వైద్య సేవలు మరింత తక్కువ ధరలకు అందుబాటులోకి రానున్నాయి. ఎక్సైజ్ డ్యూటీని 2 రూపాయల మేరకు తగ్గించడం వల్ల పెట్రోల్, డీజల్ ధరలు తగ్గనున్నాయి. అలాగే, సోలార్ ప్యానెల్స్ ధరలు కూడా తగ్గనున్నాయి.

ఇకపోతే, ఈ బడ్జెట్ తర్వాత బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలు మరింత ప్రియం కానున్నాయి. అలాగే, సిగరెట్లు, లైటర్ల ధరలు పెరగనున్నాయి. వీటితో పాటు.. ట్రై సైకిల్స్, ల్యాంపులు, స్కూటర్లు, బొమ్మల ధరల ఎక్కువ కానున్నాయి. కార్లు, సన్‌గ్లాసులు, సన్ స్క్రీన్స్, కూరగాయల ధరలు మరింత ప్రియం కానున్నాయి.

అర్టిఫిషియల్ జ్యూవెలరీ, స్మార్ట్ వాచ్‌లు, ఫర్నీచర్. మ్యాట్లు, సెంటు వంటు సువాసనలు, పాదరక్షకులు పెరగనున్నాయి. టీవీలు, మొబైల్ ధరలు, వీడియో గేమ్స్ పరికరాలు వంటి ధరలు పెరగనున్నాయి.


దీనిపై మరింత చదవండి :