గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 1 ఏప్రియల్ 2024 (18:48 IST)

వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని ద్వారాలు వుండాలి.. సిద్ధ పురుషులు గురించి..?

వాస్తు ప్రకారం ఇంట్లో ఎన్ని ద్వారాలు వుండాలనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంటికి ప్రధాన ద్వారం, ప్రధాన ద్వారానికి నేరుగా మరో ద్వారం వుండాలి. వెనుక ద్వారం లేకపోయినా చిన్నపాటి కిటికీ అయినా వుండాలి. 
 
ఇంట్లోని గదులకు ప్రధాన ద్వారా తప్పనిసరి. తలుపులు లేని గదులు మాత్రం వుండకూడదు. పూర్వకాలంలో వాస్తు, శిల్ప శాస్త్రం ఆధారంగా  నిర్మితమైన భవనాలు, ఆలయాలు నేటి వరకు కూడా అద్భుతంగా దర్శనమిస్తున్నాయనే విషయాన్ని మరిచిపోకూడదు. అందుకే వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం మంచిది. 
 
సిద్ధుల గురించి.. 
సిద్ధులు ఏ ప్రదేశంలోనైనా వసించే శక్తిని కలిగివుంటారు. సిద్ధులు గురువులుగా కలియుగంలో సంచరిస్తారని.. మానవులకు మార్గ నిర్దేశం చేస్తారు. ఏ సిద్ధపురుషుడిని మనసున ధ్యానిస్తారో.. నమశ్శివాయ అనే పంచాక్షరీతో పాటు ఆ సిద్ధుడి పేరును కలిపి ధ్యానించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి. ధ్యానం ద్వారా సిద్ధ పురుషుల అనుగ్రహం పొందవచ్చు. వీరిని ధ్యానించడం ద్వారా విభూతిని నుదుటన ధరించడం తప్పక చేయాలి.