బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 13 అక్టోబరు 2021 (14:30 IST)

అప్పల బాధలు తొలగిపోవాలంటే..? తెల్లని పాలరాతి రాయిని ఎంచుకోవాలట!

Marble home
వాస్తు శాస్త్రం ప్రకారం పశ్చిమ దిక్కుకు ఎదురుగా దేవుడిని పూజించడం వల్ల సంపద కోసం చేసే కోరికలు నెరవేరుతాయి. అప్పుల భారం తొలగిపోవాలంటే.. మీ ఇంట్లో కూడా పైన చెప్పిన దిశలలో బాగా ప్రకాశవంతంగా మెరిసే ఫ్లోర్ ఉన్నట్లయితే.. ఆ నేలపై మందపాటి కార్పెట్ లేదా కార్పెట్ లేదా ఏదైనా వస్త్రం కప్పండి. ఇలా చేయడం వల్ల అప్పుల భారం నుంచి బయట పడవచ్చు. 
 
ముఖ్యంగా తలతల మెరిసే ఫ్లోర్స్ (షైనీ ఫ్లోర్స్) కారణంగా అప్పుల భారం పెరుగుతుందట. నైరుతి దిశలో ఉన్న నేలపై తలకిందులుగా అద్దం ఉంచడం ద్వారా నేల పైకి లేచినట్లు కనిపిస్తుంది. ఇది రుణ భారాన్ని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. 
 
అయితే ఉత్తర లేదా తూర్పు దిశలలో అద్దం రివర్స్‌లో ఎట్టి పరిస్థితిల్లో పెట్టకండి. ఒకవేళ మీరు ఉత్తర లేదా తూర్పు దిశలో అద్దం తలకిందులుగా ఉంచినట్లయితే.. మీరు అప్పుల పాలవుతారు. ఎందుకంటే తప్పుడు దిశలో అద్దం పెట్టడం వల్ల అది వాస్తు దోషానికి దారి తీస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం ఈశాన్య దిశలో ఉండే నేల కోసం తెల్లని పాలరాతి రాయిని ఎంచుకుంటే అంతా శుభమే జరుగుతుంది.