Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 30-09-17

శనివారం, 30 సెప్టెంబరు 2017 (05:46 IST)

Widgets Magazine
daily astro

మేషం : బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. మీ శ్రీమతి ప్రోద్బలంతో కొత్త యత్నాలు మొదలెడతారు. వృత్తుల వారికి సదవకాశాలు లభిస్తాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
వృషభం : ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ఖర్చులు అధికం కావటంతో అదనపు ఆదాయ మార్గాలు మొదలెడతారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. పత్రిక, ప్రైవేట్ సంస్థలలోని వారికి యాజమాన్యం ధోరణి నిరుత్సాహం కలిగిస్తుంది. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి.
 
మిథునం : చేతి వృత్తుల వారికి ఆదాయం అంతంతమాత్రంగానే ఉంటుంది. మీ తొందరపాటు నిర్ణయాలవల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. నూతన వ్యాపారాలు త్వరలో అనుకూలిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తాయి. స్త్రీలు విలువైవ వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి.
 
కర్కాటకం : లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్లు అనుకూలిస్తాయి. రుణ యత్నాల్లో ఆటంకాలు, చికాకులు ఎదుర్కొంటారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ఎదుటివారిని అతిగా విశ్వసించటం మంచిది కాదని గమనించండి. స్థిర చరాస్తుల కొనుగోలు విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
సింహం : వస్త్ర, బంగారం వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి చేకూరుతుంది. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు వాయిదా పడతాయి. మీ ప్రత్యర్థుల తీరును ఓ కంట కనిపెట్టండి. కొత్త హడావుడి చోటు చేసుకుంటాయి. నిరుద్యోగ యత్నాల్లో పురోగతి కనిపిస్తుంది.
 
కన్య : దైవ, సేవ, పుణ్య కార్యాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు రూపొందిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. అందరితోనూ సఖ్యతగా మెలగండి. కళ, క్రీడాకారులకు సదవకాశాలు లభిస్తాయి. రావలసిన ధనం అనుకోకుండా వసూలు కాగలదు.
 
తుల : దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. వ్యాపారాభివృద్ధికి కొత్త పథకాలు వేస్తారు. స్త్రీలకు బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. మీ మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, ఎరువులు, క్రిమి సంహారక మందుల వ్యాపారులకు చికాకు తప్పవు.
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. గృహంలో మార్పులు, చేర్పులు కొంత అసౌకర్యం కలిగిస్తాయి. మీ బాధ్యతలు, పనులు మరొకరికి అప్పగించి ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాళ్లుగా నిలుస్తాయి.
 
ధనస్సు : ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు యత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యం ఎంతో అవసరం. బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించినప్పటికినీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు.
 
మకరం : నిత్యావసర వస్తు వ్యాపారులకు కలసి రాగలదు. దూర ప్రయాణాలు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ముఖ్యుల మద్య ఆకస్మిక అభిప్రాయ బేధాలు తలెత్తుతాయి. విద్యార్థులకు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. స్త్రీలు తొందరపడి వాగ్ధానాలు చేయటంవల్ల సమస్యలు ఎదుర్కోక తప్పదు. అందరితో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
కుంభం : గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. సాహస ప్రయత్నాలకు సరియైన సమయం కాదని గమనించండి. రాజకీయాల్లోని వారికి కార్యకర్తల వల్ల సమస్యలు తప్పవు. ప్లీడర్లకు విశ్రాంతి లభిస్తుంది. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. ఉత్తర ప్రత్యుత్తరాలలో సంతృప్తిగా సాగుతాయి.
 
మీనం : బంధుమిత్రుల రాకపోకలు అధికం అవుతాయి. ఏజెంట్లకు, బ్రోకర్లకు, రియల్ ఎస్టేట్ రంగాల వారికి లాభదాయకం. ప్రేమికుల మధ్య అవగాహన పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదా పడగలవు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

శుభోదయం : ఈ రోజు రాశిఫలితాలు 29-09-17

మేషం : ఆస్థి తగాదాలు, కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. మీ బంధువులను సహాయం అర్థించే ...

news

శుభోదయం : ఈ రోజు రాశి ఫలితాలు 28-09-2017

మేషం: వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, ...

news

కలలో పాము కాటేస్తే.. అదృష్టమే..ఎలా..?

స్వప్నంలో పాములు కనబడితే మంచిదని, సృజనాత్మకత శక్తి అధికంగా ఉన్న వారికే పాములు కలలో ...

news

శుభోదయం.. ఈ రోజు రాశిఫలితాలు 27-09-2017

మేషం : నూతన పెట్టుబడులు, వివాహాది యత్నాలకు అనుకూలం. కొత్తవారితో సంబంధ బాంధవ్యాలు ...

Widgets Magazine