ప్రధాన ద్వారానికి ఎదురుగా నిద్రపోతారా..?

Last Updated: సోమవారం, 29 ఏప్రియల్ 2019 (15:10 IST)
ఇంటి ఎంట్రెన్స్, ప్రధాన ద్వారం అతిధులను ఆహ్వానించడమే కాకుండా ఓ మంచి అభిప్రాయాన్ని ఏర్పరచుకునేందుకు అవకాశం కల్పింస్తుంది. అదేవిధంగా ప్రధాన ద్వారాలకు వాస్తు శాస్త్రంలో గణనీయమైన ప్రాముఖ్యత ఉంది. వాస్తు ప్రకారం, ఇది ఇంట్లోకి సానుకూల శక్త ప్రవేశించేందుకు, గృహమంతా వ్యాపించేందుకు దోహదపడే ప్రాంతం. అందువలన గృహం, కార్యాలయాలు ప్రధాన ద్వారానికి ప్రధాన ద్వారానికి సంబంధించి విధిగా వాస్తును పాటించాలి.

ఇంతకు ముందు పేర్కొన్న ప్రధాన ద్వారం కొరకువాస్తు చిట్కాలు ప్రకారం, లోపలి నుండి లేదా బయట నుండి ప్రధానం ద్వారానికి ఎలాంటి అడ్డంకులు ఉండకూడదు. ప్రధాన ద్వారం పూర్తిగా తెరుచుకోకుండా అడ్డుకునే ఏదైనా ఫర్నిచర్ లేదా షూలను తొలగించాలి.

మీ ప్రధాన ద్వారం ఏ దిక్కులో ఉంది..? ప్రధాన ద్వారం యొక్క దిక్కు ఇంటి యొక్క పెద్దవారి పుట్టిన రోజు తేదీ ప్రకారం ఉండాలి. మెయిన్ డోర్ దిశ అనేది సాధారణంగా అందరికీ ఒకేవిధంగా ఉండదు. అందువలన మెయిన్ డోర్ యొక్క దిశ మీ పుట్టిన తేదీ ప్రకారం లెక్కించబడ్డ అత్యంత అనుకూలమైన దిశగా ఉండాలి.

మీ మెయిన్ డోరు దేనికి ఎదురుగా ఉంటుంది..? ఇది విద్యుత్ స్తంభానికి ఎదురుగా ఉండరాదు. ఎందుకంటే ఇతి వ్యతిరేక శక్తిని ఉత్పత్తి చేస్తేుంది. మీరు ప్రధాన ద్వారానికి ఎదురుగా నిద్రపోతారా..? వాస్తు ప్రకారం ప్రధాన ద్వారానికెదురుగా నిద్రపోవడం వలన మీ ఆరోగ్యంపై గణనీయమైన వ్యతిరేక ప్రభావం చూపుతుంది. ఒకవేళ దీనిని పరిహరించలేకపోయినట్టయితే, నిద్రించే సమయంలో మీ యొక్క అనుకూలమైన దిక్కును అనుసరించి మీరు నిద్రపోయేలా చూసుకోవాలి.దీనిపై మరింత చదవండి :