పగిలిన అద్దం ముఖాన్ని చూడటం అంటే...?
ఇంటి ప్రధాన ద్వారం వద్ద అద్దం ఉంచవద్దు. ఇంటి లోపలి దృశ్యాలు బయటివారికి కనిపించకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. పడకగదిలో నాలుగు దిక్కులలో, ఏ వైపైనా అద్దం ఉంటే వెంటనే దాన్ని తొలగించాలి.
పడకగదిలో అద్దం వైవాహిక విబేధాలకు కారణమవుతుంది. పగిలిన అద్దం ఇంట్లో ఉండకూడదని వాస్తు నిపుణులు అంటున్నారు. పగిలిన అద్దంలో ముఖాన్ని చూడటం అంటే దురదృష్టాన్ని ఆహ్వానించడమేనని వారు హెచ్చరిస్తున్నారు.
ఇది ఆస్తి నష్టానికి దారితీస్తుంది. అద్దాలను ఇంట్లోని మెట్ల క్రింద కానీ, ఇంటి బయట ఉన్న మెట్ల కింద కానీ అస్సలు ఉంచకూడదు.
వాస్తు ప్రకారం కొన్ని రకాల అద్దాలు ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతాయి. అయితే, వాటిని సరైన దిశలో ఉంచాలి. లేకుంటే అవి మీ ఆనందాన్ని, అదృష్టాన్ని పాడు చేస్తాయని వాస్తు నిపుణులు అంటున్నారు.