శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By chj
Last Modified: బుధవారం, 21 సెప్టెంబరు 2016 (18:18 IST)

మా ఇంట్లో తులసి పెట్టుకోవాలనుకుంటున్నాం... ఏ దిక్కులో పెట్టాలి?

తులసి కోటను పెట్టాలనుకునేవారు ఈ క్రింది నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. ఇది దోషప్రదము. తులసిని కుండీలలో ఉంచి ఆ కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము.

తులసి కోటను పెట్టాలనుకునేవారు ఈ క్రింది నియమాలను పాటించాలి. ముఖ్యంగా ఈశాన్యములో ఎట్టి పరిస్థితులలో నిర్మించరాదు. ఇది దోషప్రదము. తులసిని కుండీలలో ఉంచి ఆ కుండీలను ఈశాన్య దిశలో ఉంచిన దోషప్రదము.
 
తూర్పు దిశ యందు తూర్పు ఆగ్నేయములోను ఉత్తర దిశ యందు ఉత్తర వాయువ్యములోను తులసికోటను అరుగువేసి ఇంటినేల మట్టమునకంటె ఎత్తు తక్కువలో ఉండినట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు ఖాళీయుండునట్లుగా ఏర్పాటు చేసుకొనుట మంచిది.
 
ఇదే విధముగా దక్షిణ ఆగ్నేయములోను, పడమర వాయువ్యములోను ఏర్పాటు చేసుకొనుట మంచిది. దక్షిణ నైరుతిలోను, పడమర నైరుతిలోను తులసికోట ఇంటినేల మట్టముకంటె ఎత్తుగా ఉండునట్లుగాను చుట్టూ ప్రదక్షిణ చేయుటకు వీలుగానూ నిర్మాణం చేసుకొంటె మంచిది. తులసికోట గృహమునకుగాని ప్రహారీ గోడలకు గాని అంటకుండునట్లు నిర్మించుకోవాలి.