శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సెల్వి
Last Updated : శనివారం, 18 జూన్ 2022 (20:09 IST)

వంటగది కోసం వాడే రంగుల గురించి వాస్తు నిపుణులు ఏమంటున్నారంటే?

kitchen
వంటగది కోసం వాడే రంగుల గురించి వాస్తు నిపుణులు ఇచ్చే సూచనలు ఏంటో చూద్దాం. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో వంటగదికి వాస్తుకు కుంకుమపువ్వు  రంగును ఉపయోగించాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు. 
 
తెల్లటి వంటగది మొత్తం గృహానికి ప్రశాంతతను అందిస్తుంది. అందుచేత తెలుపు రంగుతో వాయువ్యంలో వంటగదిని ఏర్పాటు చేసుకోవచ్చు  
 
వంటగదిని ఆకుపచ్చని రంగులో ఏర్పాటు చేస్తే, ప్రశాంతకరమైన వాతావరణం వుంటుంది. అలాగే వంటగదికి పింక్ రంగును కూడా వాడవచ్చు.  
 
ఇటుక ఎరుపు లేదా నారింజ రంగులు ఇంటికి శక్తినిస్తాయి. మీ వంటగదికి ఈ రంగు పెయింటింగ్ చేయడం వలన మీరు అనేక సవాళ్లను అధిగమించి, మీ ఇంటికి సంపదను తీసుకురావచ్చు. ఆగ్నేయ దిశలో వంటగదికి ఈ రంగు వేయడం మంచిది.  
 
బ్రౌన్ రంగు  వాయువ్య దిశలో వంటగదికి వాడవచ్చు. ఇది స్వాగతించే వాతావరణాన్ని అందిస్తుంది. పసుపు రంగు నేరుగా సూర్యకాంతి లేని వంటశాలలలో చక్కగా పనిచేస్తుంది. అందుచేత వంటగదిని పసుపు రంగుతోనూ అలంకరించుకోవచ్చునని వాస్తు నిపుణులు సెలవిస్తున్నారు.